యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
జాతీయ క్రీడగా క్రికెట్: పటౌడీ పిలుపు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 2 జనవరి 2009   ( 15:09 IST )
జాతీయ క్రీడగా క్రికెట్‌ను ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ భారత జట్టు కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ హోదాను కలిగిన హాకీకి బదులు క్రికెట్‌ను ప్రకటించాలన్నారు. ప్రస్తుత భారత జట్టు ఇప్పటివరకు ఉన్న భారత జట్లలో కల్లా ఉత్తమమైందని కొనియాడారు. ఆటగాళ్లందరూ చక్కటి ఫాంలో ఉండటం కూడా అదృష్టమన్నారు.

ఎన్డీటీవీ చాట్ షోలో ఆయన మాట్లాడుతూ మహీంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని జట్టులో ఇప్పటివరకు ఇద్దరు ఉత్తమ ఓపెనర్లు ఉండేవారు కారని, మిడిల్ ఆర్డర్ కూడా ఈ తరహాలో ఎన్నడూ క్లిక్ కాలేదన్నారు. జహీర్ తిరిగి ఫాం అందిపుచ్చుకోవడం, భజ్జీ క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తున్నాడని కొనియాడారు.

ఆటపై యువీ దృష్టి సారించడం, ఇశాంత్ వంటి మంచి బౌలర్ దొరకడం జట్టు అదృష్టమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాను సవాల్ చేసే జట్లుగా దక్షిణాఫ్రికా, భారత్ ఉండగా, ఇదే తరహా ఆటతీరును కొనసాగిస్తే నెంబర్ వన్ ర్యాంకు సాధించడం పెద్ద కష్టం కాబోదన్నారు.

అయితే మొహాలీలో భారత్ ఆడిన తీరు మాత్రం తనను కాస్త నిరాశపరిచిందన్నారు. ఆ మ్యాచ్‌లో విజయం సాధించకపోవడం సరికాదన్నారు. ఆ మ్యాచ్ దాదాపుగా నాలుగు రోజుల పాటే జరిగిందని సమర్థించుకోవడం సరికాదన్నారు. ఛాంపియన్ అంటే నాలుగురోజుల్లో ప్రత్యర్థిని కట్టిపడేసేదేనని వ్యాఖ్యానించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
క్రికెట్ హాల్ ఆఫ్ ఫేంలో గవాస్కర్, కపిల్
ఓటమికి కుంగి పోవాల్సిన అవసరం లేదు: వార్న్
ఎల్బో గాయంతో వన్డే సిరీస్‌కు స్మిత్ దూరం
కెప్టెన్‌గా మాలిక్‌ను కొనసాగించాలి: హక్
ఆసీస్ సిరీస్ కెరీర్‌లోనే ఉత్తమమైంది: కలిస్
ధోనీ కుటుంబానికి బెదిరింపు లేఖ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...