యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
మరో మూడేళ్ల వరకు కెరీర్‌కు ఢోకా లేదు
సిడ్నీ (ఏజెన్సీ), గురువారం, 4 డిసెంబర్ 2008   ( 16:46 IST )
మరో మూడేళ్ల వరకు తన క్రికెట్ కెరీర్‌కు ఢోకా లేదని ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. చేతి మణికట్టు గాయం కారణంగా తన కెరీర్ ముందుగానే ముగిసిపోగలదన్న ఆందోళనలను ఆయన కొట్టిపారేశాడు. దీనిపై వైద్యులు కూడా సానుకూలంగానే నివేదిక ఇచ్చారన్నాడు.

ఆస్ట్రేలియన్ అసోసియేటడ్ ప్రెస్‌తో ఆయన మాట్లాడుతూ మళ్లీ ఆటలో ప్రవేశిస్తున్నందున సర్జన్‌ను సంప్రదించి సలహా తీసుకున్నాన్నాడు. గత కొద్ది నెలలుగా ఈ కారణంగా కొంత అసౌకర్యానికి లోనయ్యానన్నాడు. అయితే అది ఏమంత తీవ్రంగా తనను బాధించలేదన్నాడు.

దీని కారణంగా తాను ఓ టెస్టును కానీ, ట్రైనింగ్ సెషన్‌ను కానీ కోల్పోవడం కానీ ట్రైనింగ్ సెషన్‌ను కుదించడం కానీ జరగలేదన్నారు. కొంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా పెర్త్‌ టెస్టుకల్లా సిద్ధం కానున్నానన్నాడు.

పాంటింగ్ మరో ఐదేళ్ల పాటు క్రికెట్‌లో ఉంటే పలు రికార్డులు అతనికి సొంతం కావచ్చన్నది గమనార్హం. అత్యధిక టెస్టు పరుగులు, సెంచరీల రికార్డును సచిన్ నుంచి, అత్యధిక మ్యాచ్‌ల రికార్డును స్టీవ్ వానుంచి, అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రికార్డును అలన్ బోర్డర్ నుంచి కైవసం చేసుకోవచ్చు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత్‌కు సంతోషంగా తిరిగి వస్తున్నాం: స్ట్రాస్
కామన్వెల్త్ గేమ్స్‌కోసం 44మంది బాక్సర్లకు శిక్షణ
భారత్ టూర్‌కు ఇంగ్లాండ్ జట్టు రెడీ
హైదరాబాద్‌తో రంజీ: ముంబయి భారీ స్కోరు
నా రికార్డును ఫెదరర్ బద్ధలు కొడతాడు
ఢిల్లీలోనే 2010 కామన్‌వెల్త్ గేమ్స్: సీజీఎఫ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నింగి నేల నాదే ఆడియో ఆవిష్కరణ
చైనా భాషలో నిర్మితమయిన "ఇన్‌విజిబుల్ వింగ్స్" అనే చిత్రం "నింగి నేల నాదే" పేరుతో...
సన్‌రేస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం
సినీ నిర్మాత టి.త్రివిక్రమరావు మరణం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...