యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
భారత్‌కు సంతోషంగా తిరిగి వస్తున్నాం: స్ట్రాస్
అబుదాబి (ఏజెన్సీ), గురువారం, 4 డిసెంబర్ 2008   ( 16:05 IST )
భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో పాల్గొనేందుకై తాము సంతోషంగా తిరిగి వస్తున్నామని ఇంగ్లాండ్ ఓపెనర్ ఆండ్రూ స్ట్రాస్ పేర్కొన్నాడు. ముంబయిపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రతి ఆటగాడు తమ కుటుంబాల గురించి ఆలోచించడం సహజమేనన్నాడు. ఈ కారణంగానే వారు స్వదేశానికి వచ్చేశారన్నాడు.

అబుదాబికి వెళ్లిన ఇంగ్లాండ్ బృందంలో సభ్యుడిగా ఉన్న స్ట్రాస్ బీబీసీ వార్తా సంస్థతో మాట్లాడుతూ తాము గతంలో బస చేసిన, మళ్లీ బస చేయనున్న హోటల్‌లోనే ఈ దాడి జరగడం తమను షాక్‌కు గురి చేసిందన్నాడు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు క్రికెట్ కన్నా కుటుంబమే ముఖ్యమనిపిస్తుందన్నాడు.

అయితే కొద్ది రోజుల తర్వాత పరిస్థితి చక్కబడితే తాము తిరిగి క్రికెట్‌పై దృష్టి సారించడం సహజమేనన్నాడు. తమ జట్టు ఆటగాళ్లు కూడా ఇదే భావనతోనే ఉన్నారని చెప్పాడు. భారత్‌తో క్రికెట్ పెద్ద సవాల్ అని చెప్పాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కామన్వెల్త్ గేమ్స్‌కోసం 44మంది బాక్సర్లకు శిక్షణ
భారత్ టూర్‌కు ఇంగ్లాండ్ జట్టు రెడీ
హైదరాబాద్‌తో రంజీ: ముంబయి భారీ స్కోరు
నా రికార్డును ఫెదరర్ బద్ధలు కొడతాడు
ఢిల్లీలోనే 2010 కామన్‌వెల్త్ గేమ్స్: సీజీఎఫ్
వన్డే ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే ధోనీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
బే మూవీస్ అనే నిర్మాణ సంస్థ రాజా హీరోగా ఒక చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కొత్త నటుడితో ఈతరం సినిమా
యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...