ఢిల్లీలో 2010లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకై ఎంపిక చేసిన జాబితాలో ఒలింపిక్ కాంస్య పతక గ్రహీత విజేందర్ సింగ్ సహా 44మంది బాక్సర్లకు చోటు లభించింది. క్రీడల మంత్రిత్వ శాఖ ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. రూ. 678 కోట్లతో మూడేళ్ల ప్రణాళిక కింద అత్యాధునిక వసతులతో వీరికి శిక్షణ ఇవ్వనున్నామని తెలిపింది.
దీనికై ఎంపిక చేసిన బాక్సర్లలో జేఎస్ పాటిల్, అమన్ దీప్ సింగ్, సౌరవ్ వర్మ, నానో సింగ్, కుల్‌దీప్, జితేందర్ కుమార్, జస్వీర్ సింగ్, విపిన్ కుమార్, సునీల్ ఒల్లా, అభిషేక్ షా, సుఖ్వీందర్, తోరక్ ఖర్పారన్, పరమ్‌జిత్ సమోటా, సంతోష్ సింగ్, బల్‌జీత్, ఛోటేలాల్ యాదవ్, నీరజ్ గోయల్, అక్షయ్ కుమార్, సంజయ్ కోల్టే, మనోజ్ కుమార్, మన్వర్ హుస్సేన్, దేవాన్షు జైశ్వాల్‌లు ఉన్నారు.
వీరితో పాటు జగత్ సింగ్, సురంజయ్ సింగ్, బల్వీందర్ బేనివాల్, సంజయ్ కుమార్, అఖిల్ కుమార్, దినేష్ కుమార్, నార్జిత్ సింగ్, పర్మీందర్ సింగ్, ఏఎల్ లాక్రా, మన్‌ప్రీత్‌సింగ్, దివాకర్ ప్రసాద్, గురులాల్ సింగ్, రాకేష్ కలాస్కార్, అరుణ్ కుమార్, వికాస్ మాలిక్, రాం సింగ్, సత్యరాజు, అమన్‌దీప్ సింగ్, సంతోష్, సంజయ్ కుమార్, దిల్బాగ్ సింగ్‌లకు కూడా చోటు దక్కింది.
|