|
| హైదరాబాద్‌తో రంజీ: ముంబయి భారీ స్కోరు |
| ముంబయి, గురువారం, 4 డిసెంబర్ 2008 ( 08:46 IST ) | |
హైదరాబాద్‌తో జరిగే రంజీ మ్యాచ్‌లో ముంబయి భారీ స్కోరు సాధించింది. ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 602 పరుగులు చేసి, డిక్లేర్ చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ రెండో రోజు ఆట ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది.
ఇప్పటికే రవితేజ (0). రుషి రాజ్ (2)లు ప్రారంభంలోనే పెవిలియన్ బాట పట్టగా, సుమన్ (40నాటౌట్), పాయ్ (35 నాటౌట్)లు మూడో వికెట్‌కు అజేయంగా 76 పరుగులు జోడించి జట్టును ఫాలో ఆన్ ప్రమాదం నుంచి గట్టెక్కించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముంబయి బౌలర్లలో కుల్‌కర్ణి రెండు వికెట్లు పడగొట్టారు.
వాసిం జాఫర్ (256), రహానే (137)లు రెండో వికెట్‌కు 335 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, ఆ తర్వాత రోహిత్ శర్మ (39), అగార్కర్ (77నాటౌట్), సాయిరాజ్ బహుతులే (40 నాటౌట్) జట్టు భారీ స్కోరు సాధించేందుకు దోహదపడ్డారు. హైదరాబాద్ బౌలర్లలో ఎంపీ అర్జున్ నాలుగు వికెట్లు కుప్పకూల్చగా, అశ్విన్ యాదవ్, లలిత్ మోహన్‌లు చెరో వికెట్ దక్కించుకున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|