|
| నా రికార్డును ఫెదరర్ బద్ధలు కొడతాడు |
| లండన్ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008 ( 16:50 IST ) | |
తన గ్రాండ్‌స్లామ్ రికార్డును స్విస్ స్టార్, ప్రపంచ నెంబర్ టూ రోజర్ ఫెదరర్ బద్ధలు కొట్టగలడని మాజీ ప్రపంచ నెంబర్ వన్ పీట్ సాంప్రాస్ అభిప్రాయపడ్డాడు. ఫెదరర్ తిరోగమన బాటన పయనిస్తున్నాడని వస్తున్న అభిప్రాయాలు వాస్తవం కావని వ్యాఖ్యానించాడు.
ఈ ఏడాది అంతగా రాణించకపోయినప్పటికీ, 27 ఏళ్ల ఫెదరర్‌లో ఇంకా ఆడే సామర్థ్యముందన్నాడు. ఈ ఏడాది వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలలో ఓటమి పాలవడం ద్వారా కోల్పోయిన నెంబర్ వన్ స్థానాన్ని అతను తిరిగి చేజిక్కించుకోగలడన్నాడు.
అతను మరిన్ని వింబుల్డన్ టైటిళ్లు గెలిచి, తన రికార్డును బద్ధలు కొట్టగలడన్నాడు. అతను బద్ధలు కొట్టడాన్ని చూడటం మినహా తాను దానిని ఆపలేనని చెప్పాడు. ఆ క్షణాన అతని రికార్డును గౌరవించి, అభినందిస్తాన్నాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|