|
| పఠాన్ బ్రదర్స్ జోరుతో బరోడా గెలుపు |
| వడోదరా, బుధవారం, 3 డిసెంబర్ 2008 ( 09:49 IST ) | |
పఠాన్ సోదరులు సకాలంలో ఆదుకోవడంతో మహారాష్ట్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో బరోడా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మహారాష్ట్ర నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓ దశలో 75 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బరోడాను పఠాన్ సోదరులు తమ బ్యాటింగ్ ప్రతిభతో గెలుపుబాటన నడిపారు.
యూసుఫ్ పఠాన్ సరిగ్గా సెంచరీ చేసి వెనుదిరగ్గా, ఇర్ఫాన్ పఠాన్ యాభై పరుగులతో అజేయంగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ వీరిద్దరూ క్రమంగా 58, 51 పరుగులు చేయడం గమనార్హం. అంతకుముందు మహారాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులు చేసి, ఆలౌటైంది. మునాఫ్ పటేల్, రాజేష్ పవార్‌లు నాలుగేసి వికెట్లు దక్కించుకోగా, పఠాన్ సోదరులు చెరో వికెట్ పడగొట్టారు.
ఈ విజయం ద్వారా ఐదు పాయింట్లు కూడగట్టుకున్న బరోడా తన పాయింట్ల సంఖ్యను తొమ్మిదికి పెంచుకున్నప్పటికీ, సెమీస్ చేరే అవకాశాలను మాత్రం దాదాపుగా కోల్పోయిన పరిస్థితే కన్పిస్తోంది. మరోవైపు మహారాష్ట్ర కేవలం నాలుగు పాయింట్లతో చివరి స్థానం కోసం ఆంధ్రతో పోటీపడుతోంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|