|
| హైదరాబాద్‌పై జాఫర్ అజేయ డబుల్ సెంచరీ |
| ముంబయి, బుధవారం, 3 డిసెంబర్ 2008 ( 09:37 IST ) | |
హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ సూపర్ లీగ్ మ్యాచ్‌లో భారత మాజీ టెస్టు ఓపెనర్ వాసి జాఫర్ (204 నాటౌట్), రహానే (137 నాటౌట్)లు చెలరేగడంతో ముంబయి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సరికి ముంబయి ఓ వికెట్ నష్టానికి 366 పరుగులు చేసింది. గ్రూప్ ఏలో ప్రస్తుతం ముంబయి 15, హైదరాబాద్ 10 పాయింట్లను తమ ఖాతాల్లో కలిగి ఉన్నాయి.
మరోవైపు ఆంధ్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించాలనుకున్న తమిళనాడు ఆ ఆశయాన్ని నెరవేర్చుకుంది. ఆంధ్ర 283 పరుగులు చేయగా, నాలుగు వికెట్ల నష్టానికే ఆ స్కోరును దాటిన వెంటనే తమిళనాడు (ముకుంద్ 150, బద్రినాథ్ 121) డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఆంధ్రను ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ తర్వాత గ్రూప్ బీలో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన తమిళనాడు 15 పాయింట్లతో తన అగ్రస్ధానాన్ని కొనసాగిస్తుండగా, కర్ణాటక 13 పాయింట్లతో, యూపీ 14 పాయింట్లతో రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. అయితే యూపీ ఇప్పటికే ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఆంధ్ర కేవలం మూడు పాయింట్లతో చివరి స్థానంకోసం మహారాష్ట్రతో పోటీపడుతోంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|