|
| చెన్నై ఓపెన్‌కు డావిడెంకో, బ్రయాన్ సోదరులు |
| చెన్నై (ఏజెన్సీ), మంగళవారం, 2 డిసెంబర్ 2008 ( 16:57 IST ) | |
వచ్చే నెల జరిగే చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ ఐదో ర్యాంకు ఆటగాడు నికోలాయ్ డావిడెంకో (రష్యా), అమెరికాకు చెందిన సోదర ద్వయం బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్‌లు కూడా పాల్గొననున్నారు. చెన్నైలో జనవరి 5-11 తేదీలలో ఈ 450వేల డాలర్ల ఏటీపీ టెన్నిస్ టోర్నీ జరుగనుంది.
సింగిల్స్ విభాగంలో డావిడెంకోతో పాటు 13వ ర్యాంకు ఆటగాడు స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్), 23వ ర్యాంకర్ మరిన్ సిలిచ్ (క్రోయేషియా), 26వ ర్యాంకర్ ఇవో కార్లోవిచ్ (క్రోయేషియా), 33వ ర్యాంకర్, వింబుల్డన్ సెమీ పైనలిస్ట్ రైనర్ షట్లర్ (జర్మనీ), 42వ ర్యాంకర్ మాజీ ఛాంపియన్ కార్లోస్ మోయా (స్పెయిన్) తదితరులు పాల్గొనున్నారు.
అలాగే డబుల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ బ్రయాన్ సోదరులతో పాటు మహేష్ భూపతి, లియాండర్ పేస్‌లు సైతం తమ తమ భాగస్వాములైన మార్క్ నౌల్స్ (బహామాస్), లుకాస్ డ్లౌహి (చెక్ రిపబ్లిక్)లతో పాటు పాలు పంచుకోనున్నారు. కాగా ఈ టోర్నీకోసం సోమ్ దేవ్ వర్మన్, ప్రకాష్ అమృత్ రాజ్‌లతో పాటు డ్లౌహికి కూడా సింగిల్స్‌లో వైల్డ్ కార్డ్ ప్రవేశం లభించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|