యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
రంజీలో రాజస్థాన్‌పై సౌరాష్ట్ర ఇన్నింగ్స్ విజయం
రాజ్‌కోట్, మంగళవారం, 2 డిసెంబర్ 2008   ( 11:40 IST )
రాజ్‌కోట్‌లో జరిగిన రంజీ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై సౌరాష్ట్ర ఇన్నింగ్స్ 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులు వెనుకబడిన రాజస్థాన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో సైతం 85 పరుగులకే కుప్పకూల్చడం ద్వారా ఘన విజయం సాధించిన సౌరాష్ట్ర ఆరు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.

కాగా, ఢిల్లీలో రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో యూపీకి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులు (ప్రవీణ్ కుమార్ 98, చావ్లా 47) చేసిన యూపీ ఆ తర్వాత రైల్వేస్‌ను 200పరుగులకే (యేరే గౌడ్ 78 నాటౌట్, రావత్ 39) ఆలౌట్ చేసింది. అనంతరం రైల్వేస్ రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 118 పరుగులు (తన్మయ్ 51 నాటౌట్) చేసింది.

మరోవైపు మహారాష్ట్రతో జరిగే మ్యాచ్‌లో బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు (బిలాకియా 48, యూసుఫ్ 58, షా 56, ఇర్ఫాన్ పఠాన్ 51) చేయడం ద్వారా 77 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం మహారాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 273 పరుగులు (శ్రీఖండే 114, భోసలే 69)లు చేసింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆంధ్రపై ఆధిక్యం దిశగా తమిళనాడు జోరు
గంగూలీ నాయకత్వంపై షేన్ వార్న్ చురకలు
ఇంగ్లాండ్‌తో చెన్నై, మొహాలీలలో టెస్టులు: బీసీసీఐ
లీ విజృంభణ: ఆసీస్ సిరీస్ విజయం
ఇంగ్లాండ్ పర్యటించకూడదు: ఈసీబీ మాజీ ఛైర్మన్
3న భారత్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కుబేరులకు సెన్సార్ పూర్తి
"అదిరందయ్యా చంద్రం", "టాటా బిర్లా మధ్యలో లైలా" చిత్రాల తరువాత హీరో శివాజీ, దర్శకుడు...
రాజశేఖర్, భూమిక జంటగా నా స్టైలే వేరు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...