యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఆంధ్రపై ఆధిక్యం దిశగా తమిళనాడు జోరు
విజయవాడ, మంగళవారం, 2 డిసెంబర్ 2008   ( 11:18 IST )
విజయవాడలో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్రపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించే దిశగా తమిళనాడు జోరు కోనసాగిస్తోంది. ఆంధ్రను 283 పరుగులకు ఆలౌట్ చేసిన తమిళనాడు మూడో రోజు ఆటముగిసేసరికి ఓ వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. ఇటీవలే టెస్టు అరంగేట్రం చేసిన విజయ్ (0) ప్రారంభంలోనే నిష్క్రమించినప్పటికీ, ముకుంద్ (72), బద్రినాథ్ (54)లు జట్టు స్కోరును ముందుకు తీసుకువెళుతున్నారు.

మరో మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్‌పై 163 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకున్న గుజరాత్ రెండో ఇన్నింగ్స్‌లో సైతం ఆ జట్టును 192 పరుగులకే ఆలౌట్ చేసింది. తద్వారా 30 పరుగుల విజయలక్ష్యాన్ని వికెట్టు నష్టపోకుండా ఛేదించి, ఆరు పాయింట్లను ఖాతాలో వేసుకుంది.

ఒరిస్సాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగుల ఆధిక్యం సాధించిన ఒరిస్సా అదే ఊపును కొనసాగించలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసిన ఢిల్లీ అనంతరం ఒరిస్సాను 96 పరుగులకే చిత్తు చేసి, విజయాన్ని సొంతం చేసుకుంది. ఇశాంత్ శర్మ 11 వికెట్లు పడగొట్టి ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గంగూలీ నాయకత్వంపై షేన్ వార్న్ చురకలు
ఇంగ్లాండ్‌తో చెన్నై, మొహాలీలలో టెస్టులు: బీసీసీఐ
లీ విజృంభణ: ఆసీస్ సిరీస్ విజయం
ఇంగ్లాండ్ పర్యటించకూడదు: ఈసీబీ మాజీ ఛైర్మన్
3న భారత్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు
భారత్ పర్యటనకు ఫ్లింటాఫ్, హార్మిసన్‌లు నిరాసక్తి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కుబేరులకు సెన్సార్ పూర్తి
"అదిరందయ్యా చంద్రం", "టాటా బిర్లా మధ్యలో లైలా" చిత్రాల తరువాత హీరో శివాజీ, దర్శకుడు...
రాజశేఖర్, భూమిక జంటగా నా స్టైలే వేరు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...