|
| ఆసక్తికరంగా ఆసీస్-కివీస్ తొలి టెస్టు |
| బ్రిస్బేన్, 21 నవంబర్ 2008 ( 11:27 IST ) | |
బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా- న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజునే ఫలితం తేల్చే దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్న న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి ఆసీస్‌కు తమ బౌలర్ల దెబ్బను రుచి చూపింది.
న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి నిలబడలేకపోయిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. తద్వారా తన ఆధిక్యాన్ని 189 పరుగులకు పెంచుకుంది. ఆసీస్ జట్టులో ఓపెనర్ కటీచ్ (67) ఒంటరి పోరు చేస్తుండగా, హాడిన్(6)అతనికి తోడుగా క్రీజుపై ఉన్నాడు. కివీస్ బౌలర్లలో మార్టిన్ మూడు వికెట్లు పడగొట్టగా, ఓ బ్రెయిన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
అంతకుముందు టేలర్ (40), రైడర్ (30), ఫ్లిన్ (39 నాటౌట్)లు మినహా మరెవ్వరూ రాణించకపోవడంతో న్యూజిలాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో జాన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, బ్రెట్ లీ, స్టూవర్ట్ క్లార్క్, షేన్ వాట్సన్‌లు తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|