|
| ప్రోటీస్‌తో టెస్టులో ఓటమి అంచున బంగ్లా |
| బ్లోమ్‌ఫోంటైన్, శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 11:16 IST ) | |
బ్లోమ్‌ఫోంటైన్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసేసరికల్లా ఓటమి అంచుకు చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌట్ కావడం ద్వారా ఫాలోఆన్ ప్రమాదంలో చిక్కుకున్న బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసేసరికి ఓ వికెట్ నష్టానికి ఇరవై పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ ముష్‌పికర్ రహీం (48) మినహా మరెవ్వరూ రాణించకపోగా, దక్షిణాఫ్రికా జట్టులో ఎన్తిని మూడు, కల్లిస్, స్టెయిన్, మోర్కెల్‌లు రెండేసి వికెట్లు పడగొట్టగా, హారీస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేయెస్‌ను స్టెయిన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
అంతకుముందు ఓ వికెట్ నష్టానికి 299 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 441 పరుగులకు ఆలౌటైంది. స్మిత్ (157), ఆమ్లా (112)ల తర్వాత ప్రిన్స్ (59 నాటౌట్) మినహా మరెవ్వరూ రాణించలేదు. బంగ్లా బౌలర్లలో షాకిబ్ అల్ హసన్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|