|
| కాన్పూర్ వన్డేలోనూ గెలుపు భారత్‌దే |
| కాన్పూర్, గురువారం, 20 నవంబర్ 2008 ( 17:06 IST ) | |
కాన్పూర్‌లో గురువారం జరుగుతున్న మూడో వన్డేలోనూ విజయ లక్ష్మి భారత్‌నే వరించింది. వెలుతురు సరిగ్గా లేని కారణంగా మరో తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగానే అంపైర్లు ఆటను నిలిపివేయగా, డక్‌వర్త్ లూయిస్ ప్రాతిపదికన భారత్ 16 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 3-0తో ముందుకు దూసుకుపోయింది.
గంభీర్ (14), రైనా (1)లు వెంటవెంటనే అవుటైనప్పటికీ, సెహ్వాగ్ (68), రోహిత్ శర్మ (28)లు ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. వారిద్దరూ కూడా కొద్ది పరుగుల తేడాతో నిష్క్రమించగా, యువరాజ్ సింగ్ (38), ధోనీ (29 నాటౌట్). యూసుఫ్ పఠాన్ (12 నాటౌట్)లు మిగిలిన పని పూర్తి చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫ్లింటాఫ్ మూడు వికెట్లు పడగొట్టగా, బ్రాడ్, స్వాన్‌లు చెరో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోగా, బౌలర్ల ధాటికి నిలబడలేని ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 48.4 ఓవర్లలో 240 పరుగులు చేసి, ఆలౌటైంది. తొలి రెండు వన్డేలతో పోల్చితే ఇది వారికి అత్యధిక స్కోరు అయినప్పటికీ ముచ్చటగా మూడో సారి కూడా భారత బౌలర్లు ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేయడం గమనార్హం.
ఓపెనర్లు రవి బొపారా (60), ఇయాన్ బెల్ (46)లతో పాటు ఫ్లింటాఫ్ (26), షా (40), సమిత్ పటేల్ (26)లు రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు గౌరవప్రద స్కోరును సాధించగలిగింది. భారత బౌలర్లలో హర్భజన్ మూడు వికెట్లు పడగొట్టగా, ఇశాంత్ శర్మ, మునాఫ్ పటేల్‌లు రెండు చొప్పున, యువరాజ్, యూసుఫ్ పఠాన్, జహీర్ ఖాన్‌లు చెరో వికెట్ పడగొట్టారు.
షా వికెట్ ద్వారా హర్భజన్ వన్డేలలో 200వ వికెట్ దక్కించుకున్నట్లయింది. మంచు కారణంగా మ్యాచ్ ముప్పావు గంట ఆలస్యంగా ప్రారంభం కానుండగా, దీనిని 49 ఓవర్ల మ్యాచ్‌గా నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ కారణంగా పవర్ ప్లే కోసం బ్యాటింగ్ జట్టు ఎంచుకునే ఓవర్ల సంఖ్యను ఐదు నుంచి నాలుగుకు కుదించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|