|
| బీసీసీఐ టెక్నికల్ కమిటీలో గంగూలీ |
| ముంబయి, గురువారం, 20 నవంబర్ 2008 ( 14:17 IST ) | |
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ టెక్నికల్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. సునీల్ గవాస్కర్ నేతృత్వంలోని ఆ కమిటీలో గంగూలీని కూడా నామినేట్ చేస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి ఎన్.శ్రీనివాసన్ తెలిపారు.
ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేస్తూ ఈ కమిటీలో గవాస్కర్, గంగూలీలతో పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్, మాజీ టెస్టు అంపైర్ వీకే రామస్వామి కూడా సభ్యులుగా ఉండగా, బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న తాను (శ్రీనివాసన్) కన్వీనర్‌గా ఉంటానన్నారు.
మొత్తం పది మందితో ఈ కమిటీ ఏర్పాటు చేయగా, నార్త్‌జోన్ తరపున చేతన్ చౌహాన్, సౌత్ జోన్ తరపున ఎంవీ శ్రీధర్, ఈస్ట్ జోన్ తరపున బిమన్ భట్టాచార్జీ, వెస్ట్ జోన్ తరపున మిలింద్ రెగె, సెంట్రల్ జోన్ తరపున జ్ఞానేంద్రపాండేలకు కూడా చోటు కల్పించామని తెలిపారు. భారత్‌లో జరిగే అన్ని స్వదేశీ, అంతర్జాతీయ టోర్నీలకు నియమ, నిబంధనలను ఈ కమిటీ రూపొందిస్తుందని వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|