|
| కాన్పూర్ వన్డేలో భారత్ లక్ష్యం 241 |
| కాన్పూర్, గురువారం, 20 నవంబర్ 2008 ( 13:35 IST ) | |
కాన్పూర్‌లో గురువారం జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్ల ధాటికి నిలబడలేని ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 48.4 ఓవర్లలో 240 పరుగులు చేసి, ఆలౌటైంది. తొలి రెండు వన్డేలతో పోల్చితే ఇది వారికి అత్యధిక స్కోరు అయినప్పటికీ భారత్ ప్రస్తుత ఫాంను బట్టి చూస్తే భారీ లక్ష్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. ముచ్చటగా మూడో సారి కూడా భారత బౌలర్లు ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేయడం గమనార్హం.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్లు రవి బొపారా (60), ఇయాన్ బెల్ (46)లతో పాటు ఫ్లింటాఫ్ (26), షా (40), సమిత్ పటేల్ (26)లు రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు గౌరవప్రద స్కోరును సాధించగలిగింది.
భారత బౌలర్లలో హర్భజన్ మూడు వికెట్లు పడగొట్టగా, ఇశాంత్ శర్మ, మునాఫ్ పటేల్‌లు రెండు చొప్పున, యువరాజ్, యూసుఫ్ పఠాన్, జహీర్ ఖాన్‌లు చెరో వికెట్ పడగొట్టారు. షా వికెట్ ద్వారా హర్భజన్ వన్డేలలో 200వ వికెట్ దక్కించుకున్నట్లయింది.
మంచు కారణంగా మ్యాచ్ ముప్పావు గంట ఆలస్యంగా ప్రారంభం కానుండగా, దీనిని 49 ఓవర్ల మ్యాచ్‌గా నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ కారణంగా పవర్ ప్లే కోసం బ్యాటింగ్ జట్టు ఎంచుకునే ఓవర్ల సంఖ్యను ఐదు నుంచి నాలుగుకు కుదించారు. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లలో ఒక్కో మార్పు చేశారు.
పేస్ బౌలర్ హార్మిసన్ స్థానంలో స్పిన్నర్ స్వాన్‌ను ఇంగ్లాండ్ బరిలో దింపుతుండగా, భారత జట్టులో తొలి రెండు వన్డేలలో అంతగా రాణించని ఆర్పీసింగ్ బదులు ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన ఇశాంత్ శర్మ చేరాడు. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో విజయం సాధించడం ద్వారా భారత్ ఏడు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో నిలిచిన సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|