యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
కివీస్‌తో తొలి టెస్టులో ఆసీస్ 214 ఆలౌట్
బ్రిస్బేన్, గురువారం, 20 నవంబర్ 2008   ( 13:25 IST )
బ్రిస్బేన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే మొదటి టెస్టులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ వెట్టోరీ ఫీల్డింగ్ ఎంచుకోగా, వారి బౌలర్ల ధాటికి నిలబడలేకపోయిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మేన్ క్లార్క్ (98) ఒంటరి పోరు చేసినప్పటికీ, ఆ జట్టు 214 పరుగులు మించి సాధించలేకపోయింది.

క్లార్క్‌తో పాటు హస్సీ (35), సైమండ్స్ (26)లు మాత్రమే కొంతమేర రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ నాలుగు వికెట్లు పడగొట్టగా, బ్రెయిన్, రైడర్‌లు రెండేసీ, మార్టిన్, వెట్టోరీలు చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ మొదటి రోజు ఆట ముగిసేసరికి వికెట్టు నష్టపోకుండా ఏడు పరుగులు చేసింది.

మరోవైపు కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (138), ఆమ్లా (103)లు రెండో వికెట్‌కు 197 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో బ్లోమ్‌ఫోన్‌టెయిన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. మొదటి రోజు ఆట ముగిసేసరికి ఆ జట్టు నీల్ మెకంజీ (42) వికెట్ మాత్రమే కోల్పోయి 299 పరుగులు చేసింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కాన్పూర్ వన్డేలో బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
గుజరాత్‌తో హైదరాబాద్ రంజీ మ్యాచ్ డ్రా
భారత్ టూర్‌పై 12 రోజుల్లో నిర్ణయం: పీసీబీ
షెడ్యూల్ ప్రకారమే తొలి టెస్టు: మోడీ
యూపీపై తమిళనాడు ఘన విజయం
రంజీ: ఓటమి అంచుల్లో రాష్ట్ర జట్లు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ముఖ్యమంత్రికి శివప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు
ఎగువ తరగతి టిక్కెట్ రేటు 50 రూపాయలకు పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర...
21న శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం
సంక్రాతి కానుకగా జయమ్ము నిశ్చయంబురా
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...