|
| కాన్పూర్ వన్డేలో బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ |
| కాన్పూర్, గురువారం, 20 నవంబర్ 2008 ( 09:52 IST ) | |
కాన్పూర్‌లో భారత్‌తో జరిగే మూడో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మంచు కారణంగా మ్యాచ్ ముప్పావు గంట ఆలస్యంగా ప్రారంభం కానుండగా, దీనిని 49 ఓవర్ల మ్యాచ్‌గా నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ కారణంగా పవర్ ప్లే కోసం బ్యాటింగ్ జట్టు ఎంచుకునే ఓవర్ల సంఖ్యను ఐదు నుంచి నాలుగుకు కుదించారు.
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లలో ఒక్కో మార్పు చేశారు. పేస్ బౌలర్ హార్మిసన్ స్థానంలో స్పిన్నర్ స్వాన్‌ను ఇంగ్లాండ్ బరిలో దింపుతుండగా, భారత జట్టులో తొలి రెండు వన్డేలలో అంతగా రాణించని ఆర్పీసింగ్ బదులు ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన ఇశాంత్ శర్మ చేరాడు.
టాస్ గెలిచిన పీటర్సన్ మాట్లాడుతూ యువరాజ్ భీకర ఫాం కారణంగా తాము 450 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్ణయించాలనుకుంటుండగా, లక్ష్య ఛేదన ఈ మైదానంలో పెద్ద కష్టం కాబోదని భారత కెప్టెన్ ధోనీ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో విజయం సాధించడం ద్వారా భారత్ ఏడు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో నిలిచిన సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|