|
| గుజరాత్‌తో హైదరాబాద్ రంజీ మ్యాచ్ డ్రా |
| అహ్మదాబాద్, గురువారం, 20 నవంబర్ 2008 ( 09:32 IST ) | |
కెప్టెన్ అర్జున్ యాదన్ (118) అజేయ సెంచరీతో గుజరాత్‌తో జరిగిన రంజీ సూపర్ లీగ్ మ్యాచ్‌ను హైదరాబాద్ డ్రా చేసుకుంది. మూడు వికెట్ల నష్టానికి 45 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో నాలుగోరోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. సుమన్ (43), ఖాద్రి (32), అర్జున్(34)లు అతనికి చక్కటి సహకారం అందించారు.
అయితే కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఆంధ్ర ఆటగాళ్లు పూర్తిగా చేతులెత్తేశారు. నాలుగు వికెట్ల నష్టానికి 28 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 117 పరుగులకే ఆలౌటైంది. కర్ణాటక బౌలర్లలో అప్పన్న నాలుగు, వినయ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయాన్ని శాసించారు.
మూడు మ్యాచ్‌ల అనంతరం గ్రూప్ ఏలో హైదరాబాద్ ఏడు పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతుండగా, గ్రూప్ బీలో ఆంధ్ర కేవలం రెండు పాయింట్లతో చివరి స్థానంలో ఉండటం గమనార్హం. గ్రూప్ ఏలో ముంబై, గుజరాత్, సౌరాష్ట్రలు, గ్రూప్ బీలో తమిళనాడు, కర్ణాటక, యూపీలు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచి, సెమీస్ రేసులో ముందున్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|