|
| యూపీపై తమిళనాడు ఘన విజయం |
| ఘజియాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008 ( 11:16 IST ) | |
దినేష్ కార్తిక్ (213), బద్రినాధ్(123)లతో పాటు బౌలింగ్‌లో బాలాజీ (8-91) అద్భుతంగా రాణించడంతో యూపీపై రంజీ సూపర్ లీగ్ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన తమిళనాడు తన పాయింట్ల సంఖ్యను 12కు పెంచుకుని గ్రూప్ బిలో అగ్రస్థానాన నిలిచింది.
తమిళనాడుకు 357 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సమర్పించుకున్న యూపీ రెండో ఇన్నింగ్స్‌లో సైతం 119 పరుగులకే ఆలౌట్ కావడం ద్వారా ఇన్నింగ్స్ 238 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
మరో మ్యాచ్‌లో ఢిల్లీపై 35 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించిన ముంబయి జట్టు మూడో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్టు నష్టపోకుండా 149 పరుగులు చేసింది. జాఫర్ 71, కుక్రేజా 77 పరుగులతో క్రీజుపై ఉన్నారు.
అలాగే పంజాబ్ చేసిన 482 పరుగుల తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ధీటుగా సౌరాష్ట్ర నాలుగు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. ఇటీవలి కాలంలో ట్రిపుల్ సెంచరీలతో హడలగొట్టిన చటేశ్వర్ పుజారా మరోసారి రాణించి, 189 పరుగులు చేయగా, కోటక్ 102 పరుగులు చేసి, జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|