యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
గంగూలీ స్థానం యువీతో భర్తీ: శ్రీకాంత్
కోల్‌కత (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008   ( 10:46 IST )
ఇటీవల టెస్టు జట్టు నుంచి వైదొలగిన మాజీ కెప్టెన్ గంగూలీ స్థానాన్ని యువరాజ్ సింగ్‌తో భర్తీ చేయడం సముచితంగా ఉంటుందని సెలక్షన్ బోర్డు ఛైర్మన్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ఇతరులు కూడా పోటీలో ఉన్నప్పటికీ, యువరాజ్ సింగ్‌ను అన్ని విధాలా అర్హుడిగా భావించవచ్చన్నారు.

టెలిగ్రాఫ్ పత్రికతో ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా వన్డేలను ఒంటి చేత్తో గెలిపించగలనని యువరాజ్ సింగ్ నిరూపించుకున్నాడన్నారు. టెస్టుల్లో కూడా అతను అదే తీరులో అద్భుతంగా రాణించగలడని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఐదేళ్ల క్రితం టెస్టుల్లో అరంగేట్రం చేసిన యువరాజ్ ఇప్పటివరకు 23 టెస్టుల్లో 1050పరుగులు చేయగా, 219 వన్డేలలో 6397 పరుగులు చేయడం గమనార్హం. టెస్టుల్లో ఉదాశీనతకు గురైనప్పటికీ, ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని తొలి రెండు వన్డేలలో వరుస సెంచరీలు చేయడం ద్వారా సత్తాను చాటుకున్నాడన్నది గమనార్హం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
హైదరాబాద్‌పై గుజరాత్ భారీ స్కోరు
కర్ణాటక దెబ్బకు ఆంధ్ర బ్యాట్స్‌మెన్ విలవిల
షాంఘై మాస్టర్స్ ఛాంపియన్ జకోవిచ్
యువీ ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్‌కు మరో విజయం
వెస్టిండీస్‌పై పాకిస్థాన్ వన్డే క్లీన్ స్వీప్
ఐసీఎల్ ట్రోఫీ లాహోర్ బాద్షాస్ వశం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...