|
| కర్ణాటక దెబ్బకు ఆంధ్ర బ్యాట్స్‌మెన్ విలవిల |
| మైసూర్, మంగళవారం, 18 నవంబర్ 2008 ( 10:17 IST ) | |
మైసూర్‌లో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో రెండోరోజు ముగిసే సరికి ఆంధ్రపై కర్ణాటక ఆధిక్యం సాధించే దిశగా దూసుకువెళుతోంది. కెప్టెన్ రాబిన్ ఉతప్ప (133), సునీల్ జోషి (65)ల జోరుతో మొదటి ఇన్నింగ్స్‌లో 366 పరుగులు చేసిన కర్ణాటక ఆ తర్వాత ఆంధ్రను కట్టడి చేయడంలో సఫలమైంది.
రెండో రోజు ఆట ముగిసేసరికి ఆంధ్ర ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్ కీపర్ సాయి డెబ్బై పరుగులు చేయగా, కర్ణాటక స్పిన్నర్ సునీల్ జోషి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఘజియాబాద్‌లో జరిగే మరో మ్యాచ్‌లో యూపీని 150 పరుగులకు ఆలౌట్ చేసిన తమిళనాడు రెండో రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసి, భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. దినేష్ కార్తిక్ అజేయంగా 159 పరుగులు చేయగా, కెప్టెన్ బద్రినాథ్ 123 పరుగులు చేశాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|