యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
యువీ ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్‌కు మరో విజయం
ఇండోర్, సోమవారం, 17 నవంబర్ 2008   ( 17:01 IST )
తొలి వన్డేలో అద్భుత సెంచరీ చేసిన యువరాజ్‌ ఆల్‌రౌండ్ ప్రతిభ ప్రదర్శించడంతో ఇండోర్‌లో సోమవారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ 54 పరుగుల తేడాతో సునాయస విజయం సాధించింది. భారత్ నిర్ణయించిన 293 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్‌ 238 పరుగులకే ఆలౌటై, వరుసగా రెండో ఓటమిని కూడగట్టుకుంది.

ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ బెల్ (1) ప్రారంభ ఓవర్లోనే రనౌట్‌గా నిష్క్రమించగా, ప్రియార్ (38), ఆలివర్ షా (58)లు పరిస్థితిని చక్కదిద్దారు. అయితే వారిద్దరినీ యువరాజ్ సింగ్ వెంటవెంటనే అవుట్ చేయగా, కెప్టెన్ పీటర్సన్ (33), ఆండ్రూ ఫ్లింటాఫ్ (43) కొద్ది సేపు భారత శిబిరంలో గుబులు రేపి, యువీ బౌలింగ్‌లోనే నిష్క్రమించారు.

చివర్లో టెయిలెండర్లు దూకుడు ప్రదర్శించగా, కాలింగ్‌వుడ్‌ (2)ను హర్భజన్, రవి బొపారా (3)ను పఠాన్, పటేల్ (20), హార్మిసన్ (6), స్టూవర్ట్ బ్రాడ్ (22)లను సెహ్వాగ్‌లు పెవిలియన్ బాట పట్టించారు. ఆల్ రౌండ్ ప్రతిభ కనబరచిన యువరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అంతకుముందు టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకోగా, ఇన్నింగ్స్ ప్రారంభంలోనే స్టూవర్ట్ బ్రాడ్ పకడ్బందీ బౌలింగ్‌తో సెహ్వాగ్ (1), సురేష్ రైనా (4), రోహిత్ శర్మ (3)ల వికెట్లు పడగొట్టాడు. సెహ్వాగ్ క్లీన్ బౌల్డ్ రూపంలో నిష్ర్కమించగా, రైనా, రోహిత్ శర్మలను క్యాచ్‌ల ద్వారా బ్రాడ్ పెవిలియన్ బాట పట్టించాడు.

దీంతో గంభీర్, తొలి వన్డే హీరో యువరాజ్‌లు కాస్త ఆచితూచి ఆడాల్సి వచ్చింది. కొద్ది సేపు వారు జాగ్రత్తగా ఆడినప్పటికీ, ఆ తర్వాత బ్యాట్‌ను ఝళిపించారు. నాలుగో వికెట్‌కు 134 పరుగులు జోడించిన తరుణంలో గంభీర్‌ను పీటర్సన్ క్లీన్‌బౌల్డ్‌గా అవుట్ చేశాడు. ఎట్టకేలకు జట్టు స్కోరు 239 వద్ద ఉండగా, బ్రాడ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా యువరాజ్ (118) వెనుదిరిగాడు.

ధోనీ (15), హర్భజన్ (8), జహీర్ (1), ఆర్పీసింగ్(1) నిరాశపరిచినప్పటికీ, చివర్లో యూసుఫ్ పఠాన్ (29 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, రెండు బౌండరీలతో 50నాటౌట్) రాణించడంతో భారత్ 292 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, హార్మిసన్, కాలింగ్‌వుడ్, పీటర్సన్‌లు చెరో వికెట్ దక్కించుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వెస్టిండీస్‌పై పాకిస్థాన్ వన్డే క్లీన్ స్వీప్
ఐసీఎల్ ట్రోఫీ లాహోర్ బాద్షాస్ వశం
యువీ మరో సెంచరీ: ఇంగ్లాండ్ లక్ష్యం 293
చెస్‌ ఒలింపియాడ్‌లో రష్యాతో మహిళల డ్రా
గంభీర్, యువీల జోరుతో కోలుకున్న భారత్
మరో ముడేళ్లలో సైనా ప్రపంచ నెంబర్‌వన్: ప్రకాశ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...