యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
వెస్టిండీస్‌పై పాకిస్థాన్ వన్డే క్లీన్ స్వీప్
అబుదాబి, సోమవారం, 17 నవంబర్ 2008   ( 13:34 IST )
అబుదాబిలో అదివారం జరిగిన మూడో వన్డేలోనూ విజయం సాధించడం ద్వారా వెస్టిండీస్‌పై పాకిస్థాన్ క్లీన్ స్వీప్ సాధించింది. పాకిస్థాన్ నిర్ణయించిన 274 పరుగులను ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 242 పరుగులకే ఆలౌటై, 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ చేపట్టి నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. యూనిస్ ఖాన్ (101), మిస్బా ఉల్ హక్ (79 నాటౌట్)లు మూడో వికెట్‌కు 103 పరుగులు జోడించడం ద్వారా జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. విండీస్ బౌలర్లలో టేలర్ రెండు వికెట్లు పడగొట్టగా, పావెల్, బేకర్, మిల్లర్, గేల్‌లు చెరో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ జట్టులో కెప్టెన్ గేల్ (122), శర్వాణ్ (62)లు చక్కగా రాణించినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన వారిలో నిలకడ లోపించడంతో 46.3 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌటైంది. పాక్ జట్టులో ఇఫ్తికార్ అంజుం నాలుగు వికెట్లు పడగొట్టగా, ఉమర్ గుల్ మూడు, సోహైల్ తన్వీర్ రెండు, షాహిద్ అఫ్రిది ఓ వికెట్ దక్కించుకున్నారు. యూనిస్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా, క్రిస్ గేల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఐసీఎల్ ట్రోఫీ లాహోర్ బాద్షాస్ వశం
యువీ మరో సెంచరీ: ఇంగ్లాండ్ లక్ష్యం 293
చెస్‌ ఒలింపియాడ్‌లో రష్యాతో మహిళల డ్రా
గంభీర్, యువీల జోరుతో కోలుకున్న భారత్
మరో ముడేళ్లలో సైనా ప్రపంచ నెంబర్‌వన్: ప్రకాశ్
మాస్టర్స్ కప్ ఫైనల్స్‌లో జకోవిచ్, డేవిడెంకో
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...