యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఐసీఎల్ ట్రోఫీ లాహోర్ బాద్షాస్ వశం
అహ్మదాబాద్, సోమవారం, 17 నవంబర్ 2008   ( 13:17 IST )
అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన మూడో ఫైనల్లో హైదరాబాద్ హీరోస్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన లాహోర్ బాద్షాస్ ఐసీఎల్ ట్వంటీ 20 ట్రోఫీని కైవసం చేసుకుంది. హైదరాబాద్ హీరోస్ నిర్ణయించిన 159 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.5ఓవర్లలో ఛేదించడం ద్వారా లాహోర్ బాద్షాస్ తిరుగులేని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

టాస్ గెలిచిన హైదరాబాద్ హీరోస్ బ్యాటింగ్ ఎంచుకుని, నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ ఖలీల్ (45)తో పాటు స్టూవర్ట్ బిన్ని (25), జస్టిన్ కెంప్ (22 నాటౌట్)లు చక్కగా రాణించారు. లాహోర్ బౌలర్లలో షాహిద్ నజీర్ మూడు, సక్లెయిన్ ముస్తాక్ రెండు వికెట్లు పడగొట్టగా, మొహమ్మద్ సమి, అజార్ మొహమ్మద్‌లు చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ బాద్షాస్ జట్టులో ఓపెనర్లు ఇమ్రాన్ నజీర్ (111 నాటౌట్), ఇమ్రాన్ ఫర్హాత్ (28)లు 108 పరుగులతో శుభారంభం అందించారు. హైదరాబాద్ బౌలర్లలో రజాక్, బోయేలు చెరొ వికెట్ దక్కించుకున్నారు. ఇమ్రాన్ నజీర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికవగా, నవీద్ ఉల్ హసన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యువీ మరో సెంచరీ: ఇంగ్లాండ్ లక్ష్యం 293
చెస్‌ ఒలింపియాడ్‌లో రష్యాతో మహిళల డ్రా
గంభీర్, యువీల జోరుతో కోలుకున్న భారత్
మరో ముడేళ్లలో సైనా ప్రపంచ నెంబర్‌వన్: ప్రకాశ్
మాస్టర్స్ కప్ ఫైనల్స్‌లో జకోవిచ్, డేవిడెంకో
ఛాంపియన్ లీగ్ కోసం రెహ్మాన్ సంగీతం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...