యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
యువీ మరో సెంచరీ: ఇంగ్లాండ్ లక్ష్యం 293
ఇండోర్, సోమవారం, 17 నవంబర్ 2008   ( 13:03 IST )
తొలి వన్డే హీరో యువరాజ్‌ వరుసగా రెండో సెంచరీ నమోదు చేయడంతో ఇండోర్‌లో జరిగే రెండో వన్డేలో ఇంగ్లాండ్‌కు 293 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్ణయించింది. ప్రారంభంలోనే మూడు వికెట్లు టపటపా రాలినప్పటికీ, గంభీర్‌తో కలసి ఇన్నింగ్స్ సరిదిద్దిన యువరాజ్ అదే క్రమంలో తన రెండో సెంచరీని నమోదు చేసుకున్నాడు.

టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకోగా, ఇన్నింగ్స్ ప్రారంభంలోనే స్టూవర్ట్ బ్రాడ్ పకడ్బందీ బౌలింగ్‌తో సెహ్వాగ్ (1), సురేష్ రైనా (4), రోహిత్ శర్మ (3)ల వికెట్లు పడగొట్టాడు. సెహ్వాగ్ క్లీన్ బౌల్డ్ రూపంలో నిష్ర్కమించగా, రైనా, రోహిత్ శర్మలను క్యాచ్‌ల ద్వారా బ్రాడ్ పెవిలియన్ బాట పట్టించాడు.

దీంతో గంభీర్, తొలి వన్డే హీరో యువరాజ్‌లు కాస్త ఆచితూచి ఆడాల్సి వచ్చింది. కొద్ది సేపు వారు జాగ్రత్తగా ఆడినప్పటికీ, ఆ తర్వాత బ్యాట్‌ను ఝళిపించారు. నాలుగో వికెట్‌కు 134 పరుగులు జోడించిన తరుణంలో గంభీర్‌ను పీటర్సన్ క్లీన్‌బౌల్డ్‌గా అవుట్ చేశాడు.

ఎట్టకేలకు జట్టు స్కోరు 239 వద్ద ఉండగా, బ్రాడ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా యువరాజ్ (118) వెనుదిరిగాడు. ధోనీ (15), హర్భజన్ (8), జహీర్ (1), ఆర్పీసింగ్(1) నిరాశపరిచినప్పటికీ, చివర్లో యూసుఫ్ పఠాన్ (29 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, రెండు బౌండరీలతో 50నాటౌట్) రాణించడంతో భారత్ 292 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, హార్మిసన్, కాలింగ్‌వుడ్, పీటర్సన్‌లు చెరో వికెట్ దక్కించుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చెస్‌ ఒలింపియాడ్‌లో రష్యాతో మహిళల డ్రా
గంభీర్, యువీల జోరుతో కోలుకున్న భారత్
మరో ముడేళ్లలో సైనా ప్రపంచ నెంబర్‌వన్: ప్రకాశ్
మాస్టర్స్ కప్ ఫైనల్స్‌లో జకోవిచ్, డేవిడెంకో
ఛాంపియన్ లీగ్ కోసం రెహ్మాన్ సంగీతం
చందర్‌పాల్ సెంచరీ వృధా: వెస్టిండీస్‌పై పాక్ గెలపు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...