|
| గంభీర్, యువీల జోరుతో కోలుకున్న భారత్ |
| ఇండోర్, సోమవారం, 17 నవంబర్ 2008 ( 11:01 IST ) | |
గంభీర్, యువరాజ్‌లు క్రీజుపై గట్టిగా నిలబడటంతో ఇండోర్‌లో జరిగే రెండో వన్డేలో ప్రారంభ తడబాటును భారత్ సరిదిద్దుకుంది. టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకోగా, ఇన్నింగ్స్ ప్రారంభంలోనే స్టూవర్ట్ బ్రాడ్ పకడ్బందీ బౌలింగ్‌తో సెహ్వాగ్ (1), సురేష్ రైనా (4), రోహిత్ శర్మ (3)ల వికెట్లు పడగొట్టాడు.
సెహ్వాగ్ క్లీన్ బౌల్డ్ రూపంలో నిష్ర్కమించగా, రైనా, రోహిత్ శర్మలను క్యాచ్‌ల ద్వారా బ్రాడ్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో గంభీర్, తొలి వన్డే హీరో యువరాజ్‌లు కాస్త ఆచితూచి ఆడాల్సి వచ్చింది.
కొద్ది సేపు వారు జాగ్రత్తగా ఆడినప్పటికీ, ఆ తర్వాత బ్యాట్‌ను ఝళిపించడంతో పరుగుల వేగం ముందుకు సాగుతూ వచ్చింది. తాజా వార్తల ప్రకారం భారత్ 24 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా, గంభీర్ (52), యువరాజ్ సింగ్ (48)లు క్రీజుపై ఉన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|