|
| మాస్టర్స్ కప్ ఫైనల్స్‌లో జకోవిచ్, డేవిడెంకో |
| షాంఘై (ఏజెన్సీ), ఆదివారం, 16 నవంబర్ 2008 ( 16:07 IST ) | |
రష్యా క్రీడాకారుడు నికోలాయ్ డేవిడెంకో ఫామ్‌లోలేక తంటాలు పడుతున్న ఆండీ ముర్రేను ఓడించి షాంఘైలో జరుగుతున్న మాస్టర్స్ కప్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. ఫైనల్స్‌లో డేవిడెంకో ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్ జకోవిచ్‌తో తలపడనున్నాడు.
శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో డేవిడెంకో 7-5, 6-2తో ముర్రేపై విజయం సాధించాడు. ఇదిలా ఉంటే ప్రపంచ నెంబర్ త్రీ క్రీడాకారుడు జకోవిచ్ సెమీస్ మ్యాచ్‌లో 4-6, 6-3, 7-5తో గిలెస్ సిమోన్‌పై చెమటోడ్చి విజయం సాధించాడు. మాస్టర్స్ కప్ ఫైనల్స్ ఆదివారం జరగనుంది. ఈ సీజన్‌లో జరిగే చివరి ప్రధాన టెన్నిస్ టోర్నీ ఇదే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|