|
| ఛాంపియన్ లీగ్ కోసం రెహ్మాన్ సంగీతం |
| హైదరాబాద్ (ఏజెన్సీ), శనివారం, 15 నవంబర్ 2008 ( 15:28 IST ) | |
వచ్చే నెల మూడు నుంచి పదవ తేదీ వరకు జరగనున్న ట్వంటీ20 ఛాంపియన్ లీగ్ కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఓ మ్యూజిక్ వీడియోను రూపొందించారు. రెహ్మాన్ రూపొందించిన ఈ మ్యూజిక్ వీడియోను శనివారం నిర్వాహకులు విడుదల చేశారు.
ఛాంపియన్ లీగ్ జరిగే సమయంలో రహ్మాన్ రూపొందించిన ఈ మ్యూజిక్‌ను అధికారిక గీతంగా వినిపించనున్నారు. అలాగే ఈ పాటను ప్రస్తుతం భారత్‌లో జరగనున్న ఛాంపియన్ లీగ్ కోసమే కాకుండా భవిష్యత్‌లో ప్రపంచ వ్యాప్తంగా జరిగే పోటీల సందర్భంగాను ఉపయోగించనుండడం విశేషం.
రానున్న డిసెంబర్‌లో జరిగే ఈ ఛాంపియన్ లీగ్ పోటీల్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల ప్రత్యక్ష ప్రసారం హక్కులను ఈఎస్‌పీఎన్, స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్ దక్కించుకున్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|