|
| చందర్‌పాల్ సెంచరీ వృధా: వెస్టిండీస్‌పై పాక్ గెలపు |
| అబుదాబీ (ఏజెన్సీ), శనివారం, 15 నవంబర్ 2008 ( 14:17 IST ) | |
అబుదాబీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ 24 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. వెస్డిండీస్ తరపున చందర్‌పాల్ (107 నాటౌట్) సెంచరీ సాధించినా జట్ట పరాజయాన్ని మాత్రం ఆపలేకపోయాడు. ఈ విజయంతో మరో వన్డే మిగిలి ఉండగానే మూడు వన్డేల ఈ సిరీస్‌ను పాక్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
ఈ వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ జట్టులో మిస్బాహుల్ హక్ (52) అర్ధ సెంచరీ సాధించగా కీపర్ కమ్రాన్ అక్మల్ (45), యునీస్‌ఖాన్ (34), షాహిద్ అఫ్రిది (28), షోహిల్ తన్వీర్ (26)లు రాణించారు. వెస్టీండీస్ తరపున పోవెల్, టైలర్లు మూడేసి వికెట్లు సాధించగా, బకెర్, మిల్లేర్లు చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
అనంతరం 233 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్ లక్ష్యాన్ని చేధించడంలో చతికిలపడింది. చందర్‌పాల్ అజేయంగా సెంచరీ సాధించినా మిగిలిన బ్యాట్స్‌మెన్ త్వరగా అవుట్ కావడంతో 48.5 ఓవర్లలో 208 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్ అయ్యింది. పాక్ జట్టులో ఉమర్ గుల్ మూడు వికెట్లు సాధించగా షోహిల్ తన్వీర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే ఇఫ్తికార్ అంజుమ్, షాహిద్ అఫ్రిది, అజ్మల్‌లు ఒక్కొ వికెట్ సాధించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|