యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
పట్టుసడలించిన భారత్: ఆస్ట్రేలియా 193/5
బెంగుళూరు (ఏజెన్సీ), 12 అక్టోబర్ 2008   ( 17:44 IST )
బెంగుళూరులో జరుగుతున్న మొదటి టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. హాడిన్ (28), వాట్సన్ (32) క్రీజ్‌లో నాటౌట్‌లుగా ఉన్నారు. ఆదివారం చివరి సెషన్ ప్రారంభంలో వరుసగా వికెట్లు పడగొట్టి పట్టుబిగిస్తున్న భారత బౌలర్లను హాడిన్, వాట్సన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

వికెట్ల కోసం భారత బౌలర్ల చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టారు. ఆస్ట్రేలియా ప్రస్తుతం మొత్తం 263 పరుగుల ఆధిక్యతలో ఉంది. మరో ఐదు వికెట్లు చేతిలో ఉన్నాయి. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, హర్భజన్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, జహీర్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే నాలుగో రోజు లంచ్ విరామానికి కాసేపు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌కు 360 పరుగుల వద్ద తెరపడింది.

లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జహీర్ ఖాన్ (57), హర్భజన్ సింగ్ (54), సీనియర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్ (51) అర్ధ సెంచరీలు సాధించడంతో భారత్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యత సాధించకుండా అడ్డుకోగలిగింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 430 పరుగుల భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ పాంటింగ్ (123), హసీ (146) సెంచరీలతో ఆసీస్ భారీ స్కోరుకు బాటలు వేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మ్యాచ్‌లో పుంజుకోగలం: రాహుల్ ద్రావిడ్
మొదటి టెస్ట్: లంచ్ సమయానికి ఆసిస్ 6/0
గంగూలీ, భజ్జీల రాణింపుతో కోలుకున్న భారత్
బెంగాల్ పత్రిక ఇంటర్వ్యూకు గంగూలీ ఖండన
జాన్సన్ దెబ్బకు భారత్‌ విలవిల: 106/4
జెలీనాతో సెమీస్ పోరుకు ఎలీనా రెడీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...