|
| గంగూలీ, భజ్జీల రాణింపుతో కోలుకున్న భారత్ |
| బెంగుళూరు, శనివారం, 11 అక్టోబర్ 2008 ( 17:12 IST ) | |
బెంగుళూరులో జరిగే తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు ధీటైన సమాధనం ఇవ్వలేక ఫాలోఆన్ ప్రమాదానికి చేరువైన భారత్‌ను గంగూలీ, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్‌లు ఆదుకున్నారు. తాజా వార్తల ప్రకారం భారత్ ఏడు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేయగా, హర్భజన్ (53), జహీర్ ఖాన్ (33)లు క్రీజుపై ఉన్నారు.
రెండో రోజున ఓపెనర్లు అందించిన శుభారంభం నీరుగారిపోగా ఓ దశలో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు మాత్రమే చేసి, ఫాలో ఆన్ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు విలవిలలాడింది. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే ఓపెనర్లు గంభీర్ (21), సెహ్వాగ్ (45)లు నిష్క్రమించగా, ఆ వెంటనే సచిన్ (13), లక్ష్మణ్ (0)లు కూడా పెవిలియన్ బాట పట్టారు.
ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ కాస్త కుదుటపడిందనుకున్న తరుణంలో రాహుల్ ద్రావిడ్ (51), ధోనీ (9)లు కూడా నిష్క్రమించారు. అయితే సంయమనంతో ఆడిన గంగూలీ (47) ఫాలో ఆన్ ప్రమాదం నుంచి తప్పించిన కొద్ది సేపటికే వెనక్కు తిరిగాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, బ్రెట్ లీ, షేన్ వాట్సన్, మైఖేల్ క్లార్క్‌లు చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ 430 పరుగుల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఆ జట్టులో కెప్టెన్ పాంటింగ్ (123), హస్సీ (146)లు సెంచరీలు చేయగా, కటీచ్ (66), హాడిన్ (33), బ్రెట్ లీ (27)లు కూడా వారికి చక్కటి సహకారం అందించారు. భారత బౌలర్లలో జహీర్ ఐదు, ఇశాంత్ నాలుగు వికెట్లు దక్కించుకోగా, హర్భజన్ ఓ వికెట్ పడగొట్టాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|