యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఆసీస్ 430 ఆలౌట్: భారత్‌కు ఓపెనర్ల శుభారంభం
బెంగళూరు, శుక్రవారం, 10 అక్టోబర్ 2008   ( 16:56 IST )
బెంగళూరులో జరిగే తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు ధీటైన సమాధనం ఇచ్చేలా భారత ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. రెండోరోజైన శుక్రవారం వర్షం కారణంగా ఆట నిర్ణీత సమయానికన్నా కొద్ది ముందుగా ఆగేసరికి భారత్ వికెట్టు నష్టపోకుండా 68 పరుగులు చేసింది.

సెహ్వాగ్ 43, గంభీర్ 20 పరుగులతో క్రీజుపై ఉన్నారు. అంతకు ముందు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ 430 పరుగుల వద్ద ముగిసింది. ఆస్ట్రేలియా వ్యూహాత్మకంగా ముందుకు సాగించిన ఇన్నింగ్స్‌కు జహీర్ ఖాన్ తన పదునైన బౌలింగ్‌తో తెరదించాడు.

నాలుగు వికెట్ల నష్టానికి 254 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌కు వాట్సన్‌ (2)ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా ప్రారంభంలోనే ఇశాంత్ శర్మ షాక్ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత హాడిన్‌ (33), బ్రెట్ లీ (27)ల సహకారంతో హస్సీ (146) జట్టు స్కోరును ముందుకు నడిపించాడు.

అయితే మధ్యలో వైట్(6) వికెట్‌ను ఇశాంత్, బ్రెట్ లీ, జాన్సన్, హస్సీ వికెట్లను జహీర్ ఖాన్ దక్కించుకున్నాడు. మొత్తంపై జహీర్ ఖాన్ ఐదు, ఇశాంత్ శర్మలు నాలుగు వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ కుంబ్లేకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. హర్భజన్ మాత్రం పాంటింగ్ వికెట్ కూల్చడం ద్వారా గౌరవం నిలబెట్టుకున్నాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆసీస్ ఇన్నింగ్స్‌కు 430 వద్ద జహీర్‌ఖాన్ తెర
ఎనిమిది ర్యాంకులు ఎగబాకిన చేతన్ ఆనంద్
క్రెమ్లిన్ కప్ టెన్నిస్ టోర్నీ క్వార్టర్స్‌లో జంకోవిచ్
గంగూలీ విమర్శలు సిరీస్ తర్వాత వస్తే బాగుండేది
తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ విజయం
పాంటింగ్ సెంచరీ: ఆసీస్ వ్యూహానికి భారత్ బ్రేక్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...