|
| ఆసీస్ ఇన్నింగ్స్‌కు 430 వద్ద జహీర్‌ఖాన్ తెర |
| బెంగుళూరు, శుక్రవారం, 10 అక్టోబర్ 2008 ( 15:35 IST ) | |
బెంగళూరులో జరిగే తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు వ్యూహాత్మకంగా ముందుకు సాగించిన ఇన్నింగ్స్‌కు జహీర్ ఖాన్ తన పదునైన బౌలింగ్‌తో తెరదించాడు. భారత బౌలింగ్‌కు కొరకరాని కొయ్యగా మారిన హస్సీ సహా చివరి మూడు వికెట్లను క్లీన్ బౌల్డ్ చేసి, భారీ స్కోరు ప్రయత్నాలకు గండి కొట్టాడు.
నాలుగు వికెట్ల నష్టానికి 254 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌కు వాట్సన్ (2)ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా ప్రారంభంలోనే ఇశాంత్ శర్మ షాక్ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత హాడిన్ (33), బ్రెట్ లీ (27)ల సహకారంతో హస్సీ (146) జట్టు స్కోరును ముందుకు నడిపించాడు.
అయితే మధ్యలో వైట్(6) వికెట్‌ను ఇశాంత్, బ్రెట్ లీ, జాన్సన్, హస్సీ వికెట్లను జహీర్ ఖాన్ దక్కించుకున్నాడు. మొత్తంపై జహీర్ ఖాన్ ఐదు, ఇశాంత్ శర్మలు నాలుగు వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ కుంబ్లేకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. హర్భజన్ మాత్రం పాంటింగ్ వికెట్ కూల్చడం ద్వారా గౌరవం నిలబెట్టుకున్నాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|