|
| క్రెమ్లిన్ కప్ టెన్నిస్ టోర్నీ క్వార్టర్స్‌లో జంకోవిచ్ |
| మాస్కో (ఏజెన్సీ), 10 అక్టోబర్ 2008 ( 12:16 IST ) | |
ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి, సెర్బియా భామ జెలీనా జంకోవిచ్ క్రెమ్లిన్ కప్ టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తన పవర్ గేమ్‌తో ఆమె 6-7, 6-3, 6-2తో రష్యా భామ వెరా దుషెవినాపై విజయం సాధించింది.
ఇప్పటికే వింబుల్డన్ ఛాంపియన్ వీనస్ విలియమ్స్, ఫ్రెంచ్ ఓపెన్ విజేత అనా ఇవనోవిచ్‌లు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించగా, జంకోవిచ్ కూడా అదే బాటలో పయనించే దుస్థితి తృటిలో తప్పింది.
తొలిసెట్‌లో హోరాహోరీగా పోరాడి ఓటమి పాలైనప్పటికీ, తర్వాతి రెండు సెట్లలో ప్రత్యర్థిపై జంకోవిచ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆమె క్వార్టర్ ఫైనల్లో ఇటలీకి చెందిన అన్ సీడెడ్ క్రీడాకారిణి ఫ్లావియా పెన్నెట్టాతో తలపడనుంది.
తొలి రౌండ్లో వీనస్‌పై నెగ్గిన ఫ్లావియా రెండో రౌండ్లో 3-6, 6-4, 6-4 సెట్లతో రష్యా భామ ఎకతెరీనా మకరోవాపై విజయం సాధించింది. కాగా, ఏడో సీడ్ వెరా జ్వొనరోవా 6-1, 6-0తో డానియేలా హంతుచోవా (స్లోవేకియా)ను చిత్తుచేసి, ఇవనోవిచ్‌ను ఓడించిన మరో స్లోవేకియా తార డోమినికా సిబుల్కోవాతో తలపడేందుకు సిద్ధమైంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|