|
| తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ విజయం |
| మిర్పూర్, శుక్రవారం, 10 అక్టోబర్ 2008 ( 09:41 IST ) | |
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మిర్పూర్‌లో గురువారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్ణయించిన 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 45.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి, ఛేదించింది.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆ జట్టులో రైడర్ (34), జేకబ్ ఓరాం (57), వెట్టోరి (30)లు మినహా మరెవ్వరూ రాణించలేకపోయారు. మష్రఫ్ మొర్తజా నాలుగు వికెట్లు పడగొట్టగా, అబ్ధుర్ రజాక్ మూడు, షాదాత్ హొస్సేన్, షాకిబ్ అల్ హసన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్ తమీం ఇక్బాల్ 12 పరుగులకే అవుట్ కాగా, జునైద్ సిద్ధిఖ్ (85), ముష్పిఖర్ రహీం (30), మొహమ్మద్ అష్రఫుల్ (60)లు చక్కగా రాణించి, జట్టును విజయ పథాన నడిపించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|