|
| పాంటింగ్ సెంచరీ: ఆసీస్ వ్యూహానికి భారత్ బ్రేక్ |
| బెంగళూరు, గురువారం, 9 అక్టోబర్ 2008 ( 17:00 IST ) | |
బెంగళూరులో జరిగే తొలి టెస్టులో సెంచరీ సాధించడం ద్వారా పాంటింగ్ భారత్‌లో రాణించలేకపోతున్నానన్న అపవాదును తొలగించుకున్నప్పటికీ, ఆసీస్ వ్యూహాత్మక బ్యాటింగ్ చివర్లో కాస్త తడబడింది.
టాస్ గెలిచిన పాంటింగ్ బ్యాటింగ్ ఎంచుకోగా, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 254పరుగులు చేసింది. ప్రస్తుతం మైఖేల్ హస్సీ (46) క్రీజ్‌లో ఉండగా, మైఖేల్ క్లార్క్ (11) అవుటైన వెంటనే తొలిరోజు ఆటను ఆపేశారు.
ఓపెనర్ హేడెన్‌ను మొదటి ఓవర్‌లోనే కీపర్ క్యాచ్ ద్వారా డకౌట్‌గా జహీర్‌ఖాన్ పెవిలియన్ బాట పట్టించాడు. కానీ ఆ తర్వాత పాంటింగ్‌తో కలసి నెమ్మదిగా ఆడుతూ, జట్టు స్కోరును 166 పరుగుల వరకు తీసుకెళ్లిన సమయంలో ఇశాంత్ శర్మ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి కటీచ్ (66) నిష్క్రమించాడు.
ఈ క్రమంలోనే సంయమనంతో ఆడి 243 బంతుల్లో 13 బౌండరీలతో 123 పరుగులు చేసిన పాంటింగ్ చివరకు హర్భజన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే క్లార్క్‌ను సైతం జహీర్‌ఖాన్ ఎల్బీడబ్ల్యూ చేయడంతో ఆసీస్ వ్యూహం దెబ్బతిన్నట్టయింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|