|
| సంయమనంతో ముందుకు సాగుతున్న ఆసీస్ |
| బెంగుళూరు, గురువారం, 9 అక్టోబర్ 2008 ( 13:28 IST ) | |
బెంగళూరులో జరిగే తొలి టెస్టులో ఓపెనర్ హేడెన్‌ను మొదటి ఓవర్‌లోనే డకౌట్‌గా జహీర్‌ఖాన్ పెవిలియన్ బాట పట్టించినప్పటికీ, ఆ తర్వాత కటీచ్, పాంటింగ్‌లు సంయమనంతో ఆడుతూ, జట్టును భారీ స్కోరు దిశగా ముందుకు నడుపుతున్నారు.
వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇవ్వడం ద్వారా హేడెన్ నిష్క్రమించాడు. తాజా వార్తల ప్రకారం ఆస్ట్రేలియా ఓ వికెట్ నష్టానికి 123 పరుగులు చేసింది. ప్రస్తుతం కటీచ్ (53), కెప్టెన్ పాంటింగ్ (64)లు క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచిన పాంటింగ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ టెస్టులో తలపడే భారత జట్టులో కెప్టెన్ కుంబ్లేతో పాటు గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, ధోనీ, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇశాంత్ శర్మలు ఉన్నారు.
అలాగే ఆస్ట్రేలియా జట్టులో పాంటింగ్, హేడెన్, కటీచ్‌లతో పాటు మైఖేల్ హస్సీ, మైఖేల్ క్లార్క్, వైట్, షేన్ వాట్సన్, బ్రాడ్ హాడిన్, బ్రెట్ లీ, మిచాయిల్ జాన్సన్, స్టూవర్ట్ క్లార్క్‌లు ఉన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|