యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
తుషారా మెరుపులు: భారత్ 258 పరుగులకు ఆలౌట్
కొలంబో, 27 ఆగస్టు 2008   ( 18:36 IST )
కొలంబో ఆర్పీఎస్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో వన్డేలో లంక బౌలర్ తుషారా మెరుపు దాడితో భారత్ 258 పరుగులకే ఆలౌటైంది. దీనితో శ్రీలంక ముందు 259 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ఉంచింది. భారత జట్టులో సురేష్ రైనా (76), మహేంద్ర సింగ్ ధోనీ (71), విరాట్ కొహ్లి (54) లు అర్ధ సెంచరీలు చేశారు. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్‌కు దిగింది.

శ్రీలంక బౌలర్ల ధాటికి భారత జట్టు 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో రైనా-ధోనీలు నాలుగో వికెట్‌కు 143 పరుగులు జోడించి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. సురేష్ రైనా 6 ఫోర్లు, సిక్స్‌తో 76 పరుగులు చేయగా, ధోనీ 4 ఫోర్లతో నిలకడగా 71 పరుగులుచేసి అవుటయ్యాడు.

రైనా ఔటైన తర్వాత భారత జట్టు అనవసర ఒత్తిడికి లోనై 34 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. యువరాజ్ సింగ్ డకౌటై నిరాశపరిచాడు. శ్రీలంక బౌలర్లలో తుషార 5, కులశేఖర, వాస్, మెండిస్, మురళీలు తలా ఒక వికెట్ పడగొట్టారు. వన్డేల్లో వాస్ తాజా వికెట్‌తో 400 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. నాలుగో వన్డేలో భారత్ గెలిస్తే సిరీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంటుంది. లంక గెలుపు సాధిస్తే సిరీస్ 2-2తో సమానం అవుతుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆసియా కప్‌లో చోటు టర్నింగ్ పాయింట్: భూటియా
వారం రోజుల ముందుగానే ఇరానీ కప్ సమరం
భద్రతాపరమైన ఆందోళనలతో బెంగుళూరు ఓపెన్ రద్దు
యూఎస్ ఓపెన్: రెండో రౌండులో ఇవనోవిచ్
పాకిస్థాన్ హాకీ కోచ్ ఖ్వాజా జకాఉద్దీన్ రాజీనామా
యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసంపై ఫెదరర్ దృష్టి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై...
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...