|
| యూఎస్ ఓపెన్: రెండో రౌండులో ఇవనోవిచ్ |
| న్యూయార్క్ (ఏజెన్సీ), 27 ఆగస్టు 2008 ( 13:06 IST ) | |
యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్ ఇవనోవిచ్‌కు తొలి రౌండులో పెద్ద పరాభవం తప్పింది. మంగళవారం జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ తొలి రౌండు మ్యాచ్‌లో వెరా దుషెవినాపై ఇవనోవిచ్ చెమటోడ్చి నెగ్గింది. పరాజయం పాలైతే యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్‌లో హోదాలో బరిలో దిగి తొలి రౌండు నుంచి వెనుదిరిగిన మొదటి క్రీడాకారిణిగా ఇవోనోవిచ్ పరాభవాన్ని మూటగట్టుకునేది.
ఈ మ్యాచ్‌లో ఇవనోవిచ్ 6-1, 4-6, 6-4 సెట్ల తేడాతో దుషెవినా (రష్యా)పై విజయం సాధించింది. కుడికాలి బొటనువేలికి గాయం కావడంతో ప్రపంచ నెంబర్‌వన్ ఇవనోవిచ్ ఈ మ్యాచ్‌లో ఇబ్బంది పడింది. మూడో సెట్‌లో 3-2తో వెనుకబడిన అనంతరం తేరుకున్న ఇవనోవిచ్ తన సామర్థ్యాన్ని నిరూపించుకొని రెండు రౌండులోకి అడుగుపెట్టింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|