యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఛాంపియన్స్ ట్రోఫీ వాయిదా: స్వాగతించిన బీసీసీఐ
ముంబయి (ఏజెన్సీ), 25 ఆగస్టు 2008   ( 14:01 IST )
పాకిస్థాన్‌లో మరికొన్ని రోజుల్లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీని వచ్చే ఏడాది ఆగస్టుకు వాయిదా వేస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదివారం తీసుకున్న నిర్ణయాన్ని బీసీసీఐ స్వాగతించింది. కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు పాకిస్థాన్‌లో భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో, ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఐసీసీలోని సభ్యలందరూ ఈ నిర్ణయంతో ఏకీభవించారని, తాము కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించామని బీసీసీఐ కార్యదర్శి నిరంజన్ షా తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాదికి వాయిదా వేయడం తమనేమీ నిరాశపరచలేదని చెప్పారు.

షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 12న ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో ప్రారంభం కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లో ఈ టోర్నీ నిర్వహణకు బీసీసీఐ మద్దతుగా నిలిచింది. తాము పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో మద్దతుగా నిలిచినప్పటికీ, భద్రతా పరిస్థితిని పరిగణలోకి తీసుకొని వాయిదా నిర్ణయంతో ఏకీభవించామని షా వెల్లడించారు.

ఆదివారం జరిగిన ఐసీసీ బోర్డు టెలీకాన్ఫరెన్స్‌లో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీని వచ్చే ఏడాది అక్టోబర్‌కు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ దేశాల క్రికెట్ బోర్డులు వ్యక్తం చేసిన భద్రతపరమైన ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న ఐసీసీ, ఈ టోర్నమెంట్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని నిర్ణయించింది.

ఐసీసీలో సభ్యదేశాలన్నీ ఈ నిర్ణయంతో ఏకీభవించాయి. షెడ్యూల్ ప్రకారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 12న పాకిస్థాన్‌లో ప్రారంభం కావలిసి ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్‌లో ఆటగాళ్ల భద్రతపై పలు దేశాల క్రికెట్ బోర్డులు ఆందోళన వ్యక్తం చేశాయి.

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఏకంగా ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగే ఆలోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
క్యాచ్‌లు నేలపాలు కావడానికి ప్రేక్షకులు కారణం: ధోనీ
ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది అక్టోబర్‌కు వాయిదా
మూడో వన్డేలో విజయం: సిరీస్‌లో భారత్‌కు ఆధిక్యత
బీజింగ్ ఒలింపిక్స్: స్వర్ణాల రేసులో చైనాదే అగ్రస్థానం
టోర్నీని వేరే దేశానికి తరలిస్తే మేము ఆడం: పీసీబీ
దాల్మియాపై సివిల్ కేసు పెట్టేందుకు బీసీసీఐ నిర్ణయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై...
కొత్తదనం లోపించిన బలాదూర్
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...