|
| బి శాంపిల్ పరీక్షలోనూ పాజిటివ్‌గా తేలిన అసిఫ్ |
| కరాచీ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 18:27 IST ) | |
పాకిస్థాన్ వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అసిఫ్ ఈసారి తీవ్రమైన చిక్కుల్లో పడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా జరిగిన డోప్ పరీక్షల్లో దొరికిపోయిన అసిఫ్, తాజాగా నిర్వహించిన బి శాంపిల్ పరీక్షలోనూ పాజిటివ్‌గా తేలాడు. డ్రగ్స్ వాడినట్టు పూర్తిగా ధృవీకరణ కావడంతో అసిఫ్‌పై రెండేళ్ల నిషేధం విధించే అవకాశాలున్నాయి.
బి శాంపిల్ పరీక్షలోనూ అసిఫ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు నిర్ధారణ అయిందని అతని తరపు న్యాయవాది షాహిద్ కరీం తెలిపారు. అయితే మొదటి పరీక్ష నివేదికకు, ఇప్పుడు వచ్చిన బి శాంపిల్ పరీక్ష నివేదికకు చాలా తేడా ఉందన్నారు. రెండు పరీక్షల నివేదికలు భిన్నంగా ఉండటం వింతగా ఉందని చెప్పారు.
ఇదిలా ఉంటే అసిఫ్ బి శాంపిల్ పరీక్ష సోమవారం జరిగింది. ఈ పరీక్షలో అసిఫ్ మూత్ర నమూనాలో 5.4 మిల్లీగ్రాముల నాండ్రోలిన్ కనుగొన్నారు. ప్రారంభ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా జరిపిన డోప్ పరీక్షలో అసిఫ్ మూత్ర నమూనాలో 6.2 మిల్లీగ్రాముల నాండ్రోలిన్ కనుగొన్నారు.
మొదటి డోప్ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన అనంతరం అసిఫ్‌ను అన్నిరకాల క్రికెట్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దూరం చేసిన సంగతి తెలిసిందే. అయితే అసిఫ్ అనంతరం బి శాంపిల్ పరీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశాడు. తాజాగా బి శాంపిల్ పరీక్షలోనూ అసిఫ్ పాజిటివ్‌గా తేలాడు. ఇప్పటికే అసిఫ్‌పై నిరవధిక నిషేధం విధించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, అతనిపై ఎటువంటి చర్య తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|