|
| వికెట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నాం: ధోనీ |
| దంబుల్లా (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 12:25 IST ) | |
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో పరాజయానికి తనదే బాధ్యతని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంగీకరించాడు. వికెట్‌ను తాను తప్పుగా అర్థం చేసుకోవడమే పరాజయానికి కారణమని ధోనీ వ్యాఖ్యానించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదని చెప్పాడు. ఈ నిర్ణయమే మ్యాచ్‌లో భారత్ విజయావకాశాలను ప్రభావితం చేసిందన్నాడు.
ప్రారంభంలో టీం ఇండియా ఆటగాళ్లు వికెట్‌ను సరిగా అంచనా వేయలేకపోయారు. సీమ్, స్వింగ్ బౌలింగ్‌కు ఈ వికెట్ అంతగా అనూకూలించదని భావించాము. అయితే వికెట్ కొద్దిగా తమ అంచనాలకు భిన్నంగా ఉంది. ఇదిలా ఉంటే శ్రీలంక పేస్ బౌలర్లు బాగా రాణించారని ధోనీ కితాబిచ్చాడు. భారత ఓపెనర్ల వికెట్లను వెంటనే పడగొట్టి శ్రీలంకకు మ్యాచ్‌పై పట్టుసాధించి పెట్టారు.
ఓపెనర్లు చెత్త షాట్లు ఆడి అవుటవలేదు. తమను రక్షించుకునే క్రమంలోనే అవుటయ్యారు. పేస్ బౌలర్లు ఇచ్చిన శుభారంభాన్ని మెండిస్ సద్వినియోగ పరిచాడు. భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తేవడంలో విజయవంతం అయ్యాడు. ప్రారంభంలో ఎక్కువ వికెట్లు కోల్పోయి కోలుకోవడం వన్డే క్రికెట్‌లో కష్టతరమని ధోనీ అభిప్రాయపడ్డాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|