|
| నెంబర్‌వన్ స్థానం నాకు దక్కినా ఫెదరరే గ్రేట్: నాదల్ |
| బీజింగ్ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 10:56 IST ) | |
బీజింగ్ ఒలింపిక్స్‌లో టెన్నిస్ సింగిల్స్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న రఫెల్ నాదల్, దీంతోపాటు ప్రపంచ నెంబర్‌వన్ స్థానాన్ని కూడా దక్కించుకున్నాడు. వరుసగా 237 వారాలపాటు ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అలకరించి ఉన్న స్విజ్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కిందకు పడినప్పటికీ, ఫెదరరే గొప్ప ఆటగాడని నాదల్ ప్రశంసించాడు.
ఇంతకుముందు ఫెదరర్‌ను ఓడించిన సందర్భాల్లోనూ నాదల్ ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్న సందర్భంగా నాదల్ మరోసారి ఫెదరర్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. టెన్నిస్ చరిత్రలో ఫెదరర్ వంటి ఆటగాడు లేడని కితాబిచ్చాడు. తన దృష్టిలో ఫెదరర్ ఎప్పటికీ బెస్ట్ అని పేర్కొన్నాడు.
నెంబర్‌వన్ కిరీటం దక్కినంత మాత్రాన నాకు తిరుగులేదని అనుకోను. ఆటతీరును మరింత మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తానని నాదల్ చెప్పాడు. ఇదిలా ఉంటే మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సెర్బియా క్రీడాకారిణి జంకోవిచ్ నెంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఇవనోవిచ్ నుంచి జంకోవిచ్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|