|
| ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌ను స్వాగతించకూడదు: క్రిస్టీ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008 ( 11:49 IST ) | |
ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌ను ఆహ్వానించకూడదని మాజీ ఛాంపియన్ లిన్‌ఫోర్డ్ క్రిస్టీ అభిప్రాయపడ్డారు. ఒకవైపు క్రికెటర్లు ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్‌కు కూడా చోటు కల్పించాలని విజ్ఞప్తులు చేస్తున్న తరుణంలో క్రిస్టీ పైఅభిప్రాయాన్ని వెలిబుచ్చడం గమనార్హం. క్రీడాకారుల వద్ద నుంచి ఎదురుచూసే వ్యక్తిగత క్రమశిక్షణను క్రికెట్ దెబ్బతీయగలదని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఒలింపిక్స్ కోసం ఎదురుచూస్తుంటారు. అందువలన క్రికెట్ వంటి జట్టు క్రీడలను ఒలింపిక్స్‌లోకి స్వాగతించకూడదని ఈ బ్రిటన్ ఛాంపియన్ పేర్కొన్నారు. 100 మీటర్ల ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచిన క్రిస్టీ మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశం వలన ఇతర క్రీడా విభాగాలు దెబ్బతింటాయని అభిప్రాయపడ్డారు.
వంద మీటర్ల పరుగు పందెంలో ఒలింపిక్స్ స్వర్ణాలను గెలుచుకోవడంతోపాటు క్రిస్టీ (48) ప్రపంచ ఛాంపియన్‌షిప్, కామన్వెల్త్ క్రీడలు, యూరోపియన్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. లిన్‌ఫోర్డ్ క్రిస్టీ 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో 100 మీటర్ల రేసులో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|