యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
డబుల్స్ స్వర్ణం అందుకున్న విలియమ్స్ సోదరీమణులు
బీజింగ్, 17 ఆగస్టు 2008   ( 17:15 IST )
బీజింగ్ విశ్వ క్రీడల్లో టెన్నిస్ డబుల్స్ స్వర్ణ పతకాన్ని విలియమ్స్ సోదరీమణులు అందుకున్నారు. అమెరికాకు చెందిన సెరీనా-వీనస్ విలియమ్స్‌లు 6-2, 6-0 సెట్ల తేడాతో జయభేరి మోగించారు. స్పెయిన్ తార అనెబెల్ మెడీనా-విరిజనా రువానో పాస్కల్‌లను చిత్తుగా ఓడించి ఒలింపిక్స్‌లో రెండోసారి స్వర్ణ పతకాన్ని విలియమ్స్ సిస్టర్స్ అందుకున్నారు.

మ్యాచ్ ఆరంభం నుంచి విలియమ్స్ సోదరీమణులు పదునైన షాట్లతో ప్రత్యర్ధిని ముప్పుతిప్పలు పెట్టారు. తొలి సెట్‌లో గారిక్స్-పాస్కల్‌లు ఒక మాదిరిగా పోటీనిచ్చినప్పటికీ దానిని చివరి వరకూ కొనసాగించలేకపోయారు. విలియమ్స్ సిస్టర్స్ తొలి సెట్‌ను 6-2 తేడాతో కైవసం చేసుకున్నారు.

మలి సెట్‌లో విలియమ్స్ సోదరీమణుల ఆధిపత్యం కొనసాగింది. దీనితో 6-0 తేడాతో విలియమ్స్ సిస్టర్స్ జయభేరి మోగించి టెన్నిస్ డబుల్స్ విభాగంలో ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని రెండసారి కైవసం చేసుకున్నారు. సిడ్నీ వేదికగా 2000 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌లో విలియమ్స్ సోదరీమణులు తొలిసారి డబుల్స్ స్వర్ణ పతకాన్ని అందుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఫెల్ప్స్ ప్రపంచ రికార్డు: 8వ స్వర్ణ పతకం కైవసం
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది అనుమానమే: సీఏ
క్వార్టర్స్ చేరిన బాక్సర్లకు భారీ నజరానా: హర్యానా
బాక్సింగ్‌లో భారత్ జోరు: అథ్లెట్ల బేజారు
ఒలింపిక్స్ బాక్సింగ్ క్వార్టర్స్‌లో జితేందర్ కుమార్
బీజింగ్ విశ్వ క్రీడలు: అఖిల్ అద్భుత విజయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...