|
| ఫెల్ప్స్ ప్రపంచ రికార్డు: 8వ స్వర్ణ పతకం కైవసం |
| బీజింగ్, ఆదివారం, 17 ఆగస్టు 2008 ( 10:44 IST ) | |
విశ్వ క్రీడల్లో ఎవరూ అందుకోలేని స్వర్ణ పతకాల రికార్డును మైకేల్ ఫెల్ప్స్ సాధించాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో వరుసగా 8వ స్వర్ణ పతకం సాధించి అందరిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. స్విమ్మింగ్ 4x100 మీటర్ల రిలేలో 8వ స్వర్ణ పతకాన్ని అమెరికాకు చెందిన ఫెల్ప్స్ కైవసం చేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు గెలుచుకున్న రికార్డు మార్స్ స్పిట్జ్‌ది. జర్మనీలోని మ్యూనిచ్‌లో 1972లో జరిగిన విశ్వ క్రీడల్లో స్పిట్జ్ ఏడు స్వర్ణాలు అందుకున్నాడు. స్పిట్జ్ రికార్డు 36 ఏళ్ల తర్వాత ఫెల్ప్స్ బద్దలుకొట్టాడు.
స్విమ్మింగ్ 4x100 రిలేలో ఫెల్ప్స్ కొత్త రికార్డు సృష్టించాడు. ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్ సాధించిన ఏడవ ప్రపంచ రికార్డు. బీజింగ్ విశ్వ క్రీడల్లో 400 మీటర్ల వ్యక్తిగత రిలే, 4x100 ఫ్రీస్టైల్ రిలే, 200 ఫ్రీస్టైల్, 200 బటర్‌ఫ్లై, 4x200 ఫ్రీస్టైల్ రిలే, 200 మీటర్ల వ్యక్తిగత రిలే, 100 మీటర్ల బటర్‌ఫ్లైలలో స్వర్ణ పతకాలు ఫెల్ప్స్ సాధించాడు.
ఏథెన్స్ వేదికగా 2004లో జరిగిన విశ్వ క్రీడల్లో ఫెల్ప్స్ ఆరు స్వర్ణాలు అందుకున్నాడు. ఈ ఒలింపిక్స్‌లో మొత్తం 14 పతాకాలు కైవసం చేసుకున్నాడు. స్పిట్జ్, కార్ల్ లూయిస్, పావో నూర్మి, లార్సా లాట్నినాలు 9 స్వర్ణ పతకాలు చొప్పున అత్యధికంగా గతంలో అందుకున్నారు. ఫెల్ప్స్ వయస్సు 23 సంవత్సారాలు. చిన్నప్పుడు ఫెల్ప్స్ నీళ్లంటే భయపడేవాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|