|
| ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది అనుమానమే: సీఏ |
| మెల్‌బోర్న్, శనివారం, 16 ఆగస్టు 2008 ( 16:27 IST ) | |
పాకిస్థాన్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2008 పోటీల్లో ఆస్ట్రేలియా జట్టు పాల్గొనేది అనుమానమే అని క్రికెట్ ఆస్ట్రేలియా వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎన్ని బుజ్జగింపు పనులు చేసినా తాము అక్కడ ఆడేది లేదని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్, ఉపసారథి మైకేల్ క్లార్క్‌లతో ఐసీసీ బృందం మెల్‌బోర్న్‌లో శుక్రవారం మంతనాలు జరిపింది.
తమ క్రీడాకారులకు పాకిస్థాన్‌లో భద్రత లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ఛీఫ్ ఎగ్జిక్యుటివ్ జేమ్స్ సూదర్‌లాండ్ చెప్పారు. దీనితో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని వివరించారు. పాకిస్థాన్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పించటానికి అక్కడి ప్రభుతం ముందుకువచ్చిందని ఐసీసీ జనరల్ మేనేజర్ డేవ్ రిచర్డ్‌సన్ చెప్పారు. పాకిస్థాన్‌లో ఆడటానికి ఎక్కువ జట్లు వ్యతిరేకిస్తే తాము వేదికను శ్రీలంకకు మారుస్తామని రిచర్డ్‌సన్ తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|