|
| క్వార్టర్స్ చేరిన బాక్సర్లకు భారీ నజరానా: హర్యానా |
| ఛండీగఢ్, శనివారం, 16 ఆగస్టు 2008 ( 16:07 IST ) | |
బీజింగ్ ఒలింపిక్స్ బాక్సింగ్ క్రీడ క్వార్టర్ పైనల్స్‌లోకి అడుగుపెట్టిన స్వరాష్ట్రానికి చెందిన ఇద్దరు బాక్సర్లకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. బాక్సర్లు అఖిల్ కుమార్, జితేందర్ కుమార్‌లు అత్యద్భుతంగా రాణించి భారత బాక్సింగ్ పంచ్ అంటే ఏమిటో ప్రత్యర్ధులకు రుచిచూపించారు. వీరిద్దరికీ రూ. 25 లక్షలు చొప్పున నజరానా ఇస్తున్నామని హర్యానా ప్రభుత్వం తెలిపింది.
బాక్సింగ్ క్రీడలో అఖిల్ కుమార్ సింహం లాగా పోరాడి ప్రపంచ ఛాంపియన్, రష్యా క్రీడాకారుడు వోడాప్యానోవ్‌ను మట్టికరిపించాడు. అఖిల్ సోదరుడు జితేందర్ కుమార్ మరో ప్రీక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన తులాష్‌బాయ్ డొనియోరోవ్‌పై గెలుపు సాధించాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|