|
| బాక్సింగ్‌లో భారత్ జోరు: అథ్లెట్ల బేజారు |
| బీజింగ్ (ఏజెన్సీ), శనివారం, 16 ఆగస్టు 2008 ( 15:49 IST ) | |
బీజింగ్ విశ్వ క్రీడల్లో భారత బాక్సింగ్ జట్టు ఉత్సాహంతో ముందుకు కదం తొక్కుతుంటే అథ్లెట్లు నిరాశపరిచారు. బాక్సింగ్‌లో నిన్న అఖిల్ కుమార్ ముందుకు సాగితే నేడు ఆ బాధ్యతను జితేందర్ కుమార్ భుజానకెత్తుకున్నాడు. 400 మీటర్ల పరుగు పందెం అర్హతా పోటీల్లో వికాస్ గౌడ, మందీప్ కౌర్‌లు పరాజయం పాలయ్యారు.
హర్యానాకు చెందిన 21ఏళ్ల జితేందర్ కుమార్ అద్భుతంగా రాణించి 13-6 తేడాతో ఉజ్బెకిస్థాన్ క్రీడాకారుడు తులాష్‌బాయ్ డొనియోరవ్‌ను ఓడించాడు. నాలుగు రౌండ్ల మ్యాచ్‌లో జితేందర్ ఆధిక్యం మొదటినుంచి కనిపించింది. దీంతో క్వార్టర్ ఫైనల్స్‌లోకి అఖిల్, జితేందర్‌లు ప్రవేశించారు. రష్యా క్రీడాకారుడు బాలక్‌షిన్‌తో జరిగే క్వార్టర్ పైనల్లో జితేందర్ ఆగస్టు 20వ తేదీన తలపడతాడు. బాక్సింగ్ క్రీడలో భారత క్రీడాకారుల మధ్య సహకారం పెంపొందటంతో వారి విజయాలు తేలికయ్యాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|